మెగాబ్రదర్ నటుడు, నిర్మాత నాగబాబు తాజాగా కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. రెండ్రోజులుగా దగ్గు, జర్వం లక్షణాలతో బాధపడుతున్న ఆయన టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ సడలింపులు ఇవ్వడంతో ఇటీవల సినిమా, టీవీ షూటింగులు మొదలయ్యాయి. దీంతో నటీనటులు బిజీగా మారిపోయారు. కోవిడ్-19 నిబంధనలన్నీ పాటిస్తూనే షూటింగుల్లో పాల్గొంటున్నప్పటికీ కొందరు కరోనా బారిన పడుతుండటంతో కలవరపరుస్తోంది. నాగబాబు ఓ ప్రముఖ ఛానల్‌లో ఓ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఆ సమయంలోనే ఆయనకు వైరస్ సోకినట్లు తెలుస్తోంది. దీంతో ఆ షోలో పాల్గొన్నవారితో పాటు ఆయన కుటుంబసభ్యులు ఉలిక్కిపడ్డారట. ప్రస్తుతం నాగబాబు హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై నాగబాబు నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.