telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కోహ్లీని ఏడిపిస్తున్న అనుష్క… వైరల్ అవుతున్న వీడియో

kohli

కరోనా కారణంగా సెలబ్రిటీలకు ఈ లాక్‌డౌన్ పీరియడ్ చాలాపెద్ద విరామం ఇచ్చింది. దీంతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తమ తమ ఇళ్లల్లో గడిపిన సంగతులను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తన భర్త కోహ్లీని సరదాగా ఏడిపిస్తున్న ఓ వీడియోను పోస్ట్ చేసింది స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ. హోమ్ క్వారారంటైన్‌లో ఉంటూనే ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది ఈ సెలబ్రిటీ జంట. ఈ నేపథ్యంలో ఇంట్లో సరదాగా భర్తను ఏడిపించే ప్రయత్నం చేసింది అనుష్క. ‘ఏయ్ కోలీ.. చౌకామార్.. చౌకా.. క్యా కర్రా రే’ అంటూ ఆటపట్టించింది. పైగా ఈ వీడియోను స్వతాహాగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అనుష్క షేర్ చేయడంతో అది వైరల్ అయిపోయింది. అనుష్క అలా అంటుంటే బిత్తరచూపులు చూస్తూ ఉండిపోయారు విరాట్ కోహ్లీ. ఈ వీడియో షేర్ చేసిన అనుష్క కోహ్లీ క్రికెట్ గ్రౌండ్ మిస్ అయ్యారు. ఈ రకంగా అరిచే అభిమానులను కూడా మిస్ అవుతున్నారు. అందుకే నేను కోహ్లీకి ఆ అనుభవం గుర్తుచేశాను అని పేర్కొంది.

Related posts