మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రత్యేక పాత్రల్లో దర్శక థీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘ఆర్‌ఆర్‌ఆర్. మూవీ వచ్చే ఏడాది జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఆర్‌ఆర్‌ఆర్ టీమ్ ప్రమోషన్స్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది.
ఇప్పటికే ముంబై, బెంగళూరు సిటీల్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన చిత్రబృందం.. శనివారం హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్‌మీట్‌లో దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి, రాంచరణ్, జూ. ఎన్టీఆర్‌తో పాటు హీరోయిన్ అలియా భట్‌లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చిత్ర బృందం ఆర్‌ఆర్‌ఆర్ గురించి బాలీవుడ్ నటి అలియా భట్ ఆసక్తికర విషయాలు చెప్పకొచ్చింది. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పేముందు ఆమె తెలుగులో మాట్లాడింది ‘అందరికి నమస్కారం. బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఆర్‌ఆర్‌ఆర్ ట్రైలర్ పగిలిపోయింది కదా.. ముంబైలో మాకు పిచ్చెక్కిస్తోంది అని అలియా అనగా.. ఆడిటోరియం విజిల్స్‌తో మారుమోగిపోయింది.
(అనంతరం రణ్‌బీర్‌ని ఉద్దేశిస్తూ మీ జీవితంలో ‘ఆర్’ అనే లెటర్‌కి ఎంతో ప్రత్యేకత ఉంది కదా. దానిపై స్పందించాలని విలేకరి కోరగా.. ‘ఐ లవ్ ఆర్‌ఆర్‌ఆర్’ అని ఆలియా సమాధానం ఇచ్చింది)
ఇక తారక్, రామ్‌చరణ్ చెబుతూ నా ఫస్ట్ డే షూట్ తారక్‌తో జరిగింది. తారక్ నన్ను చూసిన వెంటనే.. ‘‘కాస్త టెన్షన్‌గా ఉంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి చరణ్‌తోనే స్క్రీన్ షేర్ చేసుకుంటున్నా. నా పక్కన హీరోయిన్ లేదు’’ అని చెప్పారు. ఆ తర్వాత రోజు చరణ్‌తో షూట్.. ఆయన చాలా తక్కువగా మాట్లాడతారు. కానీ, వాళ్లిద్దరూ ఒక చోట కలిస్తే పక్కన ఎవరు ఉన్నారనేది పట్టించుకోరు. తారక్.. చరణ్‌ని సరదాగా ఆటపట్టిస్తుంటారు.
తారక్, రామ్‌చరణ్ చాలా మంచివారు నాకు చాలా విషయాలు నేర్పించారు. వీరిద్దరితో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. రాజమౌళితో కలిసి పనిచేయడం నా కల. అది నెరవేరిందని. మరోసారి ఆయనతో కలిసి పనిచేయాలనుకుంటున్నా” అని ఆలియా భట్ అన్నారు.