telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మందిరా బేడీ టాటూపై వివాదం

Mandira

మందిరా బేడీ అనే పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు టీవీ హోస్ట్ గా చేస్తూనే సినిమాల్లో బిజీ అయ్యిన మందిరా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా “సాహో” మందిరా బేడీ కల్కి అనే నెగెటివ్ పాత్రలో నటిస్తోంది. ఈ పాత్ర సినిమాకు కీలకం అని చెప్తున్నారు. కీలకమైన ఈ పాత్ర కోసం మందిరా చాల శ్రమపడింది. ఫైట్స్ గట్రా కూడా చేసినట్టు తెలుస్తోంది. సూపర్ స్టైలిష్ యాక్టింగ్ తో ఆకట్టుకుంది. 47 ఏళ్ల వయసులో కూడా మందిరా తనదైన శైలిలో ఫోటోలు పోస్ట్ చేస్తూ… ముఖ్యంగా బికినీ ట్రీట్ కు యూత్ బాగా అట్ట్రాక్ట్ అవుతుంటారు. ఒక ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అంటే చాలు లక్షల్లో లైకులు వ్యూస్ వస్తుంటాయి. ఈ బ్యూటీ ఇప్పుడు కొత్తగా ఓ వివాదంలో చిక్కుకుంది. పొట్టమీద ఓం అనే టాటూ వేసుకున్నది మందిరా. హిందూ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే టాటూను ఇలా పొట్టమీద వేసుకోవడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు. మరి నెటిజన్లకు మందిరా బేడీ ఎలాంటి సమాధానం చెవుతుందో చూడాలి.

Related posts