telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సౌత్ కొరియాకు మొట్టమొదటి ఆస్కార్ అవార్డు… చరిత్ర క్రియేట్ చేసిన “పారాసైట్”

Parasite

సౌత్ కొరియన్ ఫిల్మ్ పారాసైట్ ఉత్తమ చిత్రంగా ఎంపిక అయింది. బాంగ్ జూన్ హో దర్శకత్వంలో వచ్చిన కామెడీ థ్రిల్లర్ మూవీగా పారాసైట్.. ఏకంగా 4 ఆస్కార్ లను తన ఖాతాలో వేసుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, బెస్ట్ ఒరిజినల్ స్ర్కీన్ ప్లే, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఇలా మొత్తం నాలుగు కేటగిరీల్లో ఆస్కార్ సొంతం చేసుకుంది. విశ్లేషకుల అంచనాలకు కూడా అందకుండా “పారాసైట్” ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకుంది. అకాడమీ అవార్డుల ప్రదానోత్సవంలో థ్రిల్లర్ మూవీ పారాసైట్.. మొత్తం 6 నామినేషన్ల నుంచి బ్రేక్ చేసుకుంటూ ముందుకు దూసుకొచ్చింది. దర్శకుడు బాంగ్, అతని సహ దర్శకులు హాన్ జిన్ ఉత్తమ ఒరిజినల్ స్ర్కీన్ ప్లేకు ఫస్ట్ అవార్డు వరించింది. ఉత్తమ చిత్రంగా ఆస్కార్ అందుకున్నందుకు గొప్ప గౌరవంగా భావిస్తున్నట్టు బాంగ్ అకాడమీకి కృతజ్ఞతలు తెలిపారు. స్క్రిప్ట్ రాసుకున్నది మూవీ కోసమే.. దేశం కోసం ఎప్పుడూ స్ర్కిప్ట్ రాయలేదు.. కానీ ఇది సౌత్ కొరియాకు దక్కిన మొట్టమొదటి ఆస్కార్ అంటూ ట్రోఫీని పైకెత్తుతూ ఆనందం వ్యక్తం చేశారు.

Related posts