రెబల్ స్టార్ కృష్ణం రాజు 80వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా జరిగిన వేడుకలలో పలువురు ప్రముఖులు సందడి చేశారు. కెరీర్‌లో ఎన్నో వైవిధ్యమైన చిత్రాలతో పాటు విలక్షణ పాత్రలు పోషించిన కృష్ణంరాజు అభిమానులకి తన సినిమాల ద్వారా ఎంతో వినోదాన్ని అందించారు. ఆయన బర్త్‌డే వేడుకలని అభిమానులు గ్రాండ్‌గా జరుపుకున్నారు. కుటుంబ సభ్యులు కూడా సినీ ప్రముఖుల సమక్షంలో అంగరంగ వైభవంగా పుట్టిన రోజు వేడుకలు జరిపారు.
హైదరాబాద్‌లోని ఫామ్‌హౌజ్‌లో జరిగిన ఈ వేడుకకి మెగాస్టార్ చిరంజీవితో పాటు మోహన్ బాబు , మంచు లక్ష్మీ, విష్ణు, ప్రభాస్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. పెద్దనాన్న పెడుతున్న కేక్‌ని తింటున్న సమయంలో క్లిక్‌మనిపించిన ఫోటో సోషల్ మీడియాలో ఫుల్‌గా వైరల్ అవుతుంది. కృష్ణం రాజు నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న ప్రభాస్ నేషనల్ స్టార్‌డం పొందిన సంగతి తెలిసిందే.