telugu navyamedia
సినిమా వార్తలు

వాదోపవాదాలతో దద్ధరిల్లుతున్న మా ఛాంబర్..

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ రోజు రోజుకు వేడి పుట్టిస్తున్నాయి. మా సభ్యుల వాదోపవాదాలతో మా ఛాంబర్ దద్దరిల్లుతుంది. మా ప్రస్తుత కార్యవర్గం గడువు కాలం సెప్టెంబర్ వరకు ఉన్నప్పటికి… మా ఎన్నికలు వెంటనే నిర్వహించాలనే డిమాండ్ రోజురోజుకి ఒత్తిడి పెరుగుతోంది. అయితే మా ఎన్నికల ప్రస్థావన వచ్చినప్పుడల్లా బహిరంగా ఒకరి పై ఒకరు దుమ్మెతి పోసుకుంటున్నారు.. ప్రస్తుతం మా అధ్యక్షుడిగా ఉన్న నరేష్ పై ఇటీవల సినీ నటి హేమ తీవ్ర ఆరోపణలు చేయ‌డం జ‌రిగింది.

Caste politics again in 'MAA' election! | OK Telugu

ఈ నేప‌థ్యంలోనే ఎన్నికలు వెంటనే జరపాలని ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మెగాస్టార్‌ చిరంజీవి.. అంతేకాకుండా ప్రస్తుత కమిటీ పదవి కాలం ముగిసిందని.. దీని వల్ల సభ్యుల కోసం చేపట్టాల్సిన అనేక సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోతున్నాయని తెలిపారు. మా ఎన్నికలపై అనేక మంది సభ్యులు బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నారని.. దీని వల్ల సంస్థ ప్రతిష్ఠ మసకబారుతోందని లేఖలో చిరంజీవి అభిప్రాయపడ్డారు.

దీంతో చిరంజీవి లేఖ‌కు మ‌ద్ద‌తుగా 113 మంది మా స‌భ్యులు నిలిచారు. మ‌రింత పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం. మా ప్ర‌తిష్ఠ‌ను భంగం క‌లిగించేలా మాట్లాడిని హేమ‌కు డీఆర్ఎస్ సీరియ‌స్ అయ్యింది. క్లాస్ 8బైలాస్ కింద హేమాకు షోకేజ్ నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లో హేమ నుంచి స‌మాధానం రావాల‌ని , అది సంతృప్తి క‌రంగా ఉండాల‌ని డీఆర్‌సీ ఆదేశించింది. లేని ప‌క్షంలో హేమ‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు.

Hema Gets Show Cause Notice From MAA! -

ఇక‌పోతే..మా చరిత్రలో ఎన్నడు లేని విధంగా మా అధ్యక్ష పదవికి ఐదుగురు సభ్యులు పోటీ పడుతున్నారు. మా అధ్యక్ష పదవికి పోటీ చేయబోతున్న సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ 27 మందితో ప్యానల్‌ను ప్రకటించారు. ఇక మంచు విష్ణు, నటి
జీవితా రాజశేఖర్, హేమ, సి.వి.ఎల్ నరిసింహారావు ఫ్యానల్స్ ప్రకటించకపోయినా… ఎన్నికల బరిలో ఉంటున్నట్లు ప్రకటించారు. 

Related posts