telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ధరణి అని చెప్పి రాష్ట్రంలో సంక్షోభము సృష్టించారు….

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ…  కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త చట్టాలను వెంటనే రద్దు చేయాలి. లక్ష మంది రైతులు ప్రాణాలు తెగించి ఢిల్లీలో ఉద్యమం చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వము ఎవరిని మోసం చేయాలని చూస్తుంది, రైతులు ఉసురు పోసుకుంటుంది. కేంద్రం తో యుద్ధం అని చెప్పి ఢిల్లీ వెళ్లి వచ్చి సీఎం యూ టర్న్ తీసుకున్నాడు. ఇప్పుడు కొనుగోలు కేంద్రాల ను కూడా ఎత్తేశారు. కానీ అవి కొనసాగాల్సిందే అని తెలిపారు. సీఎం తన స్వార్థం కోసం, రాజకీయ అవసరాల కోసం రైతులు ప్రయోజనాలని తాకట్టు పెట్టారు అని పేర్కొన్నారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 27 న ఛలో హైద్రాబాద్ లో రైతులు పాల్గొనాలి. ధరణి అని చెప్పి రాష్ట్రంలో సంక్షోభము సృష్టించారు. సమస్యలు ను శాసన సభ లో ప్రస్తావించి ప్రభుత్వ మెడలు వంచుతాము అని తెలిపారు. ఇక దీని పై జగ్గా రెడ్డి మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ అంటే రైతుల, కూలీల పార్టీ. కాంగ్రెస్ పార్టీది హుందా రాజకీయాలు, టీఆర్ఎస్ పార్టీవి చిల్లర రాజకీయాలు.. టీఆరెస్ ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ కు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ.. కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఎమ్మెల్యేగా ,మంత్రిగా అవకాశం ఇచ్చింది. ఇప్పుడు టీఆర్ఎస్ లో ఉండి మీసాలు మెలేస్తూ రైతులను ఇబ్బంది పెడుతున్నారు. రైతుల సమస్యలు పట్టించుకోని, రుణమాఫీ చేయని ముఖ్యమంత్రి కేసీఆర్. కాబట్టి అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ మెడలు వంచుతాం అని అన్నారు.

Related posts