telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

టీఆర్ఎస్ పెద్దలు కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తున్నారు…

బండి సంజయ్ మాట్లాడుతూ… కార్పొరేట్, ప్రయివేట్ విద్యా సంస్థలు మీ సిబ్బందికి వెంటనే జీతాలు ఇవ్వాలి. మీ స్టాఫ్ తో మీటింగ్ పెట్టుకొని సమస్యల్ని పరిష్కరించాలి అని పేర్కొన్నారు. మీరు స్పందించక పోతే లెక్చరర్లు, టీచర్ల తరపున మా కార్యాచరణ ప్రకటిస్తాం. ఈ మేధావులతో కోట్లు సంపాదించి, ఇప్పుడు. వాళ్ళను రోడ్డున పడేస్తారా… జీతాలు ఇవ్వాల్సిందే అని కోర్టు చెప్పినా కార్పొరేట్ విద్యా సంస్థలు పాటించడం లేదు. మరి రాష్ట్ర ప్రభుత్వం  నిద్ర పోతుందా అని అన్నారు. టీఆర్ఎస్ నేతల్లో చాలా మందికి కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయి. ప్రయివేట్, కార్పొరేట్ విద్యాసంస్థల సిబ్బందికి బీజేపీ అండగా ఉంటున్నది. కార్పొరేట్ కాలేజీల చరిత్ర మా దగ్గర ఉండి. మేము దృష్టి పెడితే ఏమవుతుందో మీకు తెలుసు. 3 నెలల క్లాసులు పూర్తి ఏడాది ఫీజు వసూలు చేస్తున్నారు. మరి జీతాలు ఎందుకు ఇవ్వరు.  టీఆర్ఎస్  పెద్దలు కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తున్నారు.  ఆ రోజు ల్లో ఒక రకంగా, ఇప్పుడు ఇంకో రకంగా టీఆరెస్ వాళ్లు కార్పొరేట్ వాళ్ళను వాడుకుంటున్నారు. మేము ఓట్ల కోసం, సీట్ల కోసం ఇట్లాంటి ఉద్యమాలు చేయం. మేధావులు రోడ్డున పడ్డందుకు, వాళ్ళ కుటుంబాలు ఇబ్బంది పడుతున్నందుకు మేము సపోర్ట్ చేస్తూన్నాం. కార్పొరేట్ విద్యా సంస్థలు దిగి రావాల్సిందే.  లెక్చరర్లు అప్రమత్తంగా ఉండాలి. సీఎం కేసీఆర్ మిమ్మల్ని చీల్చే కుట్ర చేస్తాడు అని అన్నారు. చూడాలి మరి దీని పై తెరాస నేతలు ఎలా స్పందిస్తారు అనేది.

Related posts