telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

నుజ్జునుజ్జయిన వైసీపీ ఎమ్మెల్యే కారు

ycp mla car

నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి చెందిన కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. తెట్టు జంక్షన్ వద్ద శ్రీధర్ రెడ్డి కారు మరో వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో శ్రీధర్ రెడ్డి కారు ముందు భాగం తుక్కుతుక్కు అయింది. ప్రమాద సమయంలో శ్రీధర్ రెడ్డి లేకపోవడంతో పెద్ద ముప్పు తప్పినట్టైంది. ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆయన ఇంటివద్దే ఉన్నట్టు తెలుస్తోంది. ఆ సమయంలో డ్రైవర్ మాత్రమే కారులో ఉన్నాడు. అతనికి కూడా గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

కారు డ్రైవర్ ఒక పని మీద విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ ఎయిర్ బెలూన్ల సాయంతో బయటపడ్డాడు. ప్రమాదంపై కోటంరెడ్డి కూడా ఆరా తీశారు. కారు ఢీకొట్టిన వాహనం అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

Related posts