telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చంద్రబాబుకు తగ్గిన భద్రత!

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి పోలీసు భద్రత తగ్గించారు. ఉండవల్లి లోకల్ ఎస్కార్ట్ తో పాటు ఆయన ప్రయాణించే మార్గంలో రోడ్ క్లియరెన్స్ పోలీసులను తొలగించారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అలిపిరిలో చంద్రబాబుపై హత్యాయత్నం జరిగిన తరువాత ఆయన భద్రత నిమిత్తం నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్స్‌ను కేంద్రం నియమించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి స్టేట్ పోలీసులు చంద్రబాబుకు జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీని అందిస్తూ వచ్చారు. అధికారంలో ఉన్నా, లేకున్నా ఇప్పటివరకూ ఇదే భద్రత కొనసాగింది.

కానీ, ఇటీవల రాష్ట్రంలో అధికారం మారగానే, ఏ విధమైన సమీక్షలు లేకుండా, పోలీసు అధికారులు స్వయంగా భద్రత తగ్గింపు నిర్ణయాలు తీసుకుంటున్నారన్న విమర్శు వస్తున్నాయి. వాస్తవానికి బాబు, విజయవాడ లేదా గుంటూరు వైపు వెళితే, స్థానిక పోలీసులు ఎస్కార్ట్ కల్పిస్తుండగా ఆ సదుపాయాన్ని తీసేశారు. ఆయన కాన్వాయ్ వెళ్లే సమయంలో ఇతర వాహనాలు రాకుండా పోలీసులు అడ్డుకునేవారు. ఇప్పుడు బాబు కాన్వాయ్ వైపు వచ్చే వాహనాలను అడ్డుకునేందుకు పోలీసులు ఉండడం లేదు. దీంతో టీడీపీ నేతలు పోలీసుల అధికారుల చర్యలపై విమర్శలు చేస్తున్నారు.

Related posts