telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

నటుడు చంద్రమోహన్ ఇకలేరు

హైదరాబాద్: ప్రముఖ తెలుగు నటుడు చంద్ర మోహన్ (82) శనివారం కన్నుమూశారు. గుండె సంబంధిత వ్యాధులతో హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరిన ఆయన ఉదయం 9:45 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

చంద్రమోహన్ ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలోని పమిడిముక్కల గ్రామంలో మల్లంపల్లి చంద్రశేఖరరావుగా 1943 మే 23న జన్మించారు.

చంద్ర మోహన్ 1966లో రంగుల రాట్నం చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. 1968లో వాణిశ్రీకి కేరింగ్ బ్రదర్‌గా సుఖ దుఃఖాలు చిత్రంలో నటించి అవార్డులు అందుకున్నారు. 932 సినిమాల్లో నటించారు.

చంద్రమోహన్‌కు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.

Related posts