ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వైసీపీపై విమర్శలు గుప్పించారు. రైతు భరోసా పథకం గురించి మాట్లాడమంటే వైసీపీ సభ్యులు తనను విమర్శించడానికే ఎక్కువ సమయం కేటాయించారనిఅన్నారు. అందుకు జవాబిచ్చి తన సమయం వృథా చేసుకోదలచుకోలేదని చంద్రబాబుఅన్నారు. ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీలను వైసీపీ ప్రభుత్వం నిలబెట్టుకోలేదని విమర్శించారు.
“మాట తప్పం మడమ తిప్పం” అని చెప్పుకునే వైసీపీ నేతలు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని వైసీపీ సభ్యులను ప్రశ్నించారు. రైతులకు రూ.12,500 ఇస్తామని చెప్పి రూ.7,500కు మడమతిప్పిన వైసీపీ సభ్యులకు మాట్లాడే హక్కు లేదని అన్నారు.టీడీపీ హయాంలో ప్రవేశపెట్టిన రైతు రుణమాఫీ పథకం కింద నాలుగు, ఐదు విడతలకు చెందిన డబ్బులు ఇవ్వాల్సిన బాధ్యత వైసీపీ ప్రభుత్వంపై వుందని చెప్పారు.