telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

కరోనాపై భారత్ చర్యలు సంతృప్తికరం: రష్యా అధ్యక్షుడు పుతిన్

Russian President Putin

కరోనా వైయరస్ ను నియంత్రించేందుకు ఇండియా తీసుకుంటున్న చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. కోవిడ్-19 వ్యాప్తి నిరోధంపై, భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ టెలిఫోన్ లో మాట్లాడుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా వైరస్ పరిస్థితిపై వీరిద్దరూ తమ అభిప్రాయాలను పంచుకున్నారని రష్యాలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.

రష్యాలో తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలను ప్రశంసించిన ప్రధాని నరేంద్ర మోదీ, వైరస్ పై రష్యా చేస్తున్న పోరాటం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఇండియాలో నామమాత్రపు ప్రభావంతోనే వైరస్ కట్టడి అవుతుందన్న ఆశాభావాన్ని పుతిన్ వ్యక్తం చేశారు. కరోనా నుంచి ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు అవసరమైన వైద్య సేవలు, ఔషధాలు, ఇతర దేశాలకు అందించాలని ఇద్దరు నేతలూ నిర్ణయించారు.

Related posts