telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

నటరత్న ఎన్.టి.రామారావు నటించిన సాంఘిక చిత్రం ఛాయాచిత్ర వారి “మంచిమనిషి” సినిమా 11 నవంబరు 1964 విడుదల.

నిర్మాత కె. సుబ్బరాజు గారు ఛాయాచిత్ర బ్యానర్ పై ప్రముఖ దర్శకులు కె. ప్రత్యాగాత్మ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని. నిర్మించారు.

ఈ చిత్రానికి కథ, మాటలు: పినిశెట్టి, స్క్రీన్ ప్లే: కె. ప్రత్యగాత్మ, పాటలు: సి.నారాయణరెడ్డి,కొసరాజు,
దాశరథి , శ్రీ శ్రీ, సంగీతం: సాలూరి రాజేశ్వరరావు, మరియు తాతినేని చలపతిరావు, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: ఎం.కె.రాజు, కళ: ఎస్.కృష్ణారావు, నృత్యం: పసుమర్తి కృష్ణమూర్తి, ఎడిటింగ్: అంకిరెడ్డి, అందించారు.
ఈ చిత్రంలో ఎన్.టి.రామారావు,జమున, జగ్గయ్య, గుమ్మడి, మిక్కిలినేని, పద్మనాభం,రమణా రెడ్డి,
గీతాంజలి, హేమలత, బాలయ్య,సంధ్య, రాజబాబు, త్యాగరాజు,అజిత్ సింగ్, జూనియర్ భానుమతి,
బేబీ కుట్టి పద్మిని తదితరులు నటించారు.

ఈ చిత్రంలో ఎన్టీఆర్, అజిత్ సింగ్ ల కుస్తీ పోటీలు
ప్రత్యేక ఆకర్షణగా చిత్రీకరించారు.
ఇద్దరు ప్రముఖ సంగీత దర్శకులు ఒక చిత్రానికి సంగీత దర్శకత్వం వహించడం తెలుగు సినిమాలలో చాలా అరుదు. కానీ ఈ సినిమాకు ఇద్దరు సంగీత దర్శకులు ఎస్.రాజేశ్వరావు, టి. చలపతిరావు గార్లు సంగీత దర్శకత్వం వహించటం విశేషం.

వీరి సంగీత నేపథ్యంలో ఈ చిత్రం లోని పాటలు అన్ని సూపర్ హిట్ అయ్యాయి, ఘంటసాల, పి.బి. శ్రీనివాస్ గార్లు పాడిన ఈ మధురమైన పాటలు నేటికి ప్రేక్షకులను అలరిస్తున్నాయి.
“అంతగా ననుచూడకు, వింతగా గురి చూడకు”,
“‘ఏమండోయ్..ఏమండీ..ఏమండీ ఇటు చూడండీ”
“రాననుకున్నావేమో,ఇక రాననుకున్నావేమో”
“ఓ గులాబీ బాల అందాల ప్రేమమాల”
వంటి పాటలు ప్రేక్షకులను రంజింపచేసాయి.

ఈ చిత్రం విజయం సాధించి పలు కేంద్రాలలో 50 రోజులు, రెండు కేంద్రాలలో డెరైక్టర్ గా 100 రోజులు ఆడింది.
1. విజయవాడ – రామా టాకీస్ (112 రోజులు),
2. రాజమండ్రి – వీరభద్ర టాకీస్(100 రోజులు)
ప్రదర్శింపబడి శతదినోత్సవం జరుపుకున్నది….

Related posts