telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

జేమ్స్‌బాండ్‌ని కూడా వదలని కరోనా వైరస్…!

james-bond

కరోనా ప్రభావం తాజాగా జేమ్స్‌బాండ్‌ని కూడా తాకింది. స్టార్ హాలీవుడ్ నటుడు డేనియల్ క్రెయిగ్ నటించిన ‘నో టైం టు డై’ సినిమా కరోనా ఎఫెక్ట్ వల్ల ఏకంగా ఏడు నెలలు వాయిదా పడింది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన ‘జేమ్స్ బాండ్’ సిరీస్ నుంచి రాబోతున్న చివరి సినిమా ఇది. సినిమాను ఏప్రిల్‌లో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ కరోనా రోజురోజుకీ వ్యాప్తిచెందుతుండడంతో ఆ ఎఫెక్ట్ ఎక్కడ కలెక్షన్లపై ప్రభావం చూపుతుందోనని నవంబర్‌ 25కు పోస్ట్‌పోన్ చేసినట్లు ప్రకటించారు. యూకేలో మాత్రం ఈ సినిమా నవంబర్ 12న రిలీజ్ అవుతుంది. మిగతా దేశాల్లో నవంబర్ 25న విడుదల చేస్తారు. బాండ్ సినిమాలకు ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఎక్కువ లాభాలు వస్తాయి. జేమ్స్ బాండ్ సిరీస్ నుంచి వచ్చిన చివరి సినిమా 2015లో రిలీజ్ అయింది. ఓవర్‌సీస్ థియేటర్స్‌లో ఈ సినిమా 679 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. అందులో చైనా నుంచే 84 మిలియన్ డాలర్లు రాబట్టింది. గత వారం ప్రముఖ హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్ నటిస్తున్న ‘మిషన్: ఇంపాజిబుల్’ ఏడో సిరీస్‌ షూటింగ్‌ను నిలిపివేయాల్సి వచ్చింది. ఇలా అనుకున్న షెడ్యూల్‌కి షూటింగ్స్ పూర్తి కాకపోవడంతో నిర్మాతలు కోట్లల్లో నష్టపోతున్నారు. కరోనాకు భయపడి చాలా మంది సినీ ప్రముఖులు షూటింగ్‌లు రద్దు చేసుకోగా, మరికొందరు పలు జాగ్రత్తలతో సెట్స్‌కు వస్తున్నారు.

Related posts