telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“వెంకీమామ” విడుదలపై సస్పెన్స్ ?

Venki mama

వెంక‌టేశ్‌, నాగ‌చైత‌న్య క‌లిసి న‌టిస్తోన్న చిత్రం `వెంకీమామ‌`. కె.ఎస్‌.ర‌వీంద్ర ద‌ర్శ‌కుడు. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై డి.సురేష్‌బాబు, టీజీ విశ్వ‌ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకీ స‌ర‌స‌న పాయ‌ల్ రాజ్‌పుత్‌, నాగ‌చైత‌న్య స‌ర‌స‌న రాశీఖ‌న్నా హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఈ చిత్రం విడుదల తేదీపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ తాజాగా అందిన సమాచారం ప్రకారం సంక్రాంతి కంటే ముందే విడుదల చేయాలని అనుకుంటున్నారట. డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకున్నారని భావిస్తున్నారట. సంక్రాంతి పండగకు కొన్ని పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుండటంతో డిసెంబర్ రెండో వారంలోనే ఈ సినిమాను విడుదల చేస్తే ఎక్కువ వసూళ్లు రాబట్టొచ్చని చిత్ర నిర్మాతలు ఆశిస్తున్నారట. అందుకే సంక్రాంతి నుంచి తప్పుకోవాలని యోచిస్తున్నారట. మరి అధికారికంగా ప్రకటిస్తారేమో చూడాలి. కాగా ఈ మూవీని దర్శకుడు బాబీ తెరకెక్కిస్తుండగా అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం పోస్టర్స్, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. వెంకీ, నాగచైతన్య ఒకే తెరపై కనిపించనుండటంతో దగ్గుబాటి, అక్కినేని ఫ్యాన్స్.. ఈ సినిమా విడుదల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Related posts