telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“గద్దలకొండ గణేష్” క్లోజింగ్ కలెక్షన్స్

Valmiki

వరుణ్ తేజ్‌, అథ‌ర్వ ముర‌ళి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో హ‌రీష్ శంక‌ర్ తెర‌కెక్కించిన చిత్రం గ‌ద్ద‌లకొండ గ‌ణేష్‌. ప్ర‌స్తుతం బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న గ‌ద్ద‌లకొండ గ‌ణేష్ చిత్రం త‌మిళ సూప‌ర్ హిట్ మూవీ జిగ‌ర్తాండ‌కి రీమేక్ గా రూపొందింది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం స‌మ‌కూర్చారు. థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని 14 రీల్స్ నిర్మించింది. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రంలో అథ‌ర్వ‌కి జంట‌గా మృణాలినీ రవి న‌టించింది. కెరీర్‌లో తొలిసారి పవర్ ఫుల్ రోల్ చేసిన వరుణ్ తేజ‌కు బ్రహ్మరథం పట్టారు ప్రేక్షకులు. ముఖ్యంగా ఈ చిత్రం కోసం సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ అందించిన పాటలకు ప్రశంసలు దక్కాయి. “గద్దలకొండ గణేష్” బాక్సాఫీస్ వ‌ద్ద ఫైన‌ల్ ర‌న్‌లో రూ .25.15 కోట్ల థియేట్రికల్ వాటాను వసూలు చేసింది. గద్దలకొండ గణేష్ యొక్క థియేట్రికల్ హక్కులు రూ .25 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇక ఈ సినిమా ఫైన‌ల్ వ‌సూళ్లు, ప్రి రిలీజ్ బిజినెస్‌తో కంపేరిజ‌న్ చేస్తే అన్ని ఏరియాల్లోనూ బ‌య్య‌ర్లు సేఫ్ అయ్యారు.

గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ క్లోజింగ్ క‌లెక్ష‌న్స్ కోట్ల‌లో…
నైజాం – 8.74
సీడెడ్ – 3.45
ఉత్త‌రాంధ్ర – 2.66
ఈస్ట్ – 1.61
వెస్ట్ – 1.51
కృష్ణా – 1.42
గుంటూరు – 1.83
నెల్లూరు – 0.89
ఏపీ + తెలంగాణ = 22.11 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 1.96
రెస్టాఫ్ వ‌ర‌ల్డ్ – 1.08
టోట‌ల్ వ‌ర‌ల్డ్ వైడ్ షేర్ = 25.15 కోట్లు

Related posts