telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ విషయంలో తగ్గేది లేదంటున్న బన్నీ..!

Allu-Arjun

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం ‘పుష్ప’. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మికం మందన్న కథానాయికగా నటిస్తోంది. బన్నీ-సుకుమార్ కాంబినేషన్‌లో వస్తోన్న మూడో చిత్రం ఇది. లాక్‌డౌన్ సమయంలో విడుదల చేసిన అల్లు అర్జున్ ఫస్ట్‌ లుక్ సినిమాపై అంచనాలను రెండింతలు చేసింది. అయితే ఈ చిత్రం తాలూకా షూట్ లాక్ డౌన్ మూలాన వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు ఎట్టకేలకు షూటింగ్ ప్రారంభం అయ్యింది. అయితే… ఇప్పుడు బన్నీ నిహారికా పెళ్లి వేడుకలో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ఇక దీని తర్వాత మాత్రం పుష్ప మేకర్స్‌కు ఊహించని టాస్క్‌నే ముందు ఉంచాడట. ఇంతకు ముందులా ఎక్కువ కాలం గ్యాప్స్‌ వద్దని.. సాధ్యమైనంత త్వరగా షూటింగ్‌ కొనసాగించాలని సూచించాడట బన్నీ. దీనితో పుష్ఫ మేకర్స్‌ ఆ పనిలో ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే చాలా బ్రేక్‌ తీసుకున్నందున ఎలాగైనా సరే బన్నీ ఈ సినిమాని త్వరగా ఫినిష్‌ చేయాలని ఫిక్స్‌ అయినట్లు తెలుస్తుంది.

Related posts