telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

యువతితో డైరెక్టర్ బూతు చాటింగ్… అసలు జరిగిన కథ ఇదీ…!

Girl

గతేడాది అక్టోబర్‌లో ప్రముఖ బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా… బాలీవుడ్ నటుడు నానా పటేకర్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలతో మీటూ ఉద్యమానికి తెరలేపింది. ఆ తర్వాత ఎందరో నటీమణులు తమను వేధించిన దర్శకులు, నిర్మాతలు, హీరోల పేర్లు బయటపెట్టారు. టాలీవుడ్ లో శ్రీరెడ్డి కూడా పలువురు ప్రముఖులపై ఆరోపణలు చేయడంతో ఈ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. కానీ పాపం ఓ డైరెక్టర్ కు ఏమాత్రం సంబంధం లేకుండా ఇలాంటి ఓ విషయంలో అల్లరిపాలయ్యాడట. డైరెక్టర్ రవిబాబు… అవును.. థ్రిల్లర్ మూవీస్ ఎక్కువగా తీసే రవిబాబు కూడా ఇలాంటి వివాదంలో చిక్కుకున్నానని చెబుతూ ఆ వివరాలు ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు.. ఆయనకు అసలు సోషల్‌మీడియా అకౌంట్లే లేవట. ఆయన పేరుతో ఉన్నవన్నీ నకిలీవేనట… అందులో ఓ ఫేక్ ఎకౌంట్ నుంచి గతంలో రవిబాబుతో కలసి పనిచేసిన ఓ లేడీ ఆర్టిస్టుకు బూతు మెసేజులు వచ్చాయట. కానీ అసలు విషయం తెలియని సదరు లేడీ ఆర్టిస్టు రవిబాబుపై కోపం పెంచుకుందట. ఏకంగా ఓ ఛానల్ కు వెళ్లిందట. ఆ ఛానల్ వాళ్లు కూడా ఆ ఛాటింగ్ రవిబాబే చేసి ఉంటారనుకుని రవిబాబుపై నెగిటివ్ స్టోరీ వేశారట. ఆ విషయం తన అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ద్వారా తెలుసుకున్న రవిబాబు.. ఆ జర్నలిస్ట్‌కి ఫోన్‌ చేసి ‘అది నా ఫేస్‌బుక్‌ అకౌంటో కాదో తెలియకుండా ఎలా మాట్లాడతారు?’ అని అడిగాడట. ఆ తర్వాత విషయం తెలసుకున్న సదరు ఛానల్ వాళ్లు ఆ ప్రచారం ఆపేశారట. సాధారణంగా అయితే, వాళ్లపై చర్యలు తీసుకోవాలి.. కానీ నేను అవన్నీ పట్టించుకోను వదిలేశాను అంటున్నారు రవిబాబు. అందుకే తాను సోషల్ మీడియా జోలికి వెళ్లనని రవిబాబు ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Related posts