నవ్వితేనే ఆనందం
అనుకుంటే పొరబాటు కాదా?
బాధంటే కన్నీరనుకుంటే
అమాయకత్వం కాదా ?
బతుకంటే చావనుకుంటే
మూర్ఖత్వం కాదా ?
నవ్వంటే ధైర్యం…
బాదంటే ఓర్పు …
బతుకంటే త్యాగం …….
…………………………………….
కాలం కర్పూరంలా కరుమరుగవుతుంటే
వయస్సు కాలం వెంట పరుగులు తీస్తుంటే
మనస్సు మాత్రం
విశాల సాగర తీరంలో
సాగర సంగీతం వింటూ
జ్ఞాపకాల వెంట నడుస్తూవుంది
రేపంటే ఆస లేదు
నేడంటే తీపి లేదు
భవిష్యత్తుకై భయం లేదు
అందుకే మనస్సుకు వయస్సు లేదు ………..
మాటల్లో తేనె.. చేతల్లో కత్తెర: యనమల