telugu navyamedia
సినిమా వార్తలు

‘ఓనమ్‌’ సందర్భంగా మెరిసిన తారలు

కేరళలో జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో ఓనం పండగ ఒకటి. తెలుగువారికి సంక్రాంతి ఎలాగోమలయాళీలకు ఓనమ్‌ అలాగ అన్నమాట. 10 రోజుల పాటు నిర్వహిస్తారు జరుపుకునే ఈ పండుగలో మొదటి రోజును అతమ్‌ అని, చివరి రోజును ఓనమ్‌గా జరుపుకుంటారు.

పూలు,ఫలాలు, పంటలు, పిండి వంటలు,ఆటపాటలతో కేరళ వ్యాప్తంగా వేడకులు ఘనంగా జరుపుకుంటారు. ఈ పండగను మళయాళీలందరూ భక్తి శ్రద్దలతో, కుటుంబసభ్యులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకుంటారు.

ఈ పది రోజులు అనేక సాంస్కృతిక, జానపద కార్యక్రమాలతో పాటు వివిధ సాహస కార్యక్రమాలు చేపడతారు. ఒక్కోరోజు ఒక్కో కార్యక్రమం నిర్వహించే తీరు యాత్రికులను, స్థానికులను అలరిస్తుంది. కాగా, ఓనం పండగను పురస్కరించుకుని పలువురు సినీ తారలు సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Related posts