సూపర్‌స్టార్ రజనీకాంత్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం “2.0”. ఈ చిత్రంలో రజినీకాంత్ ప్రధాన పాత్రలో, లేడీ రోబోగా ఎమీజాక్సన్, పక్షిరాజుగా బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ కీలక పాత్రల్లో నటించారు. దాదాపు 600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్, హై టెక్నికల్ వేల్యూస్‌తో రూపొందిన ఈ చిత్రం గత ఏడాది నవంబర్‌లో విడుదలైంది. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం అనుకున్న స్థాయిలో కమర్షియల్‌గా సక్సెస్‌ను సాధించలేదు. ఇప్పుడు ఈ చిట్టి రోబో చైనాలో సందడి చేయబోతున్నాడు. జూలై 12న చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు హెచ్ వై మీడియా అనే డిస్ట్రిబ్యూషన్ సంస్థ గతంలో ప్రకటించింది. కాని డిస్నీసంస్థ నుండి వచ్చిన “ద లయన్ కింగ్” అనే చిత్రం హై విజువల్స్ తో జులై 19న సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో 2.0 చిత్రాన్ని వాయిదా వేసారు. ఇటీవల కొత్త డేట్ అనౌన్స్ చేశారు. 3డీలో 47 వేల స్క్రీన్స్‌లో ఈ చిత్రం సెప్టెంబర్ 6న విడుదల కానుండగా, ఓ విదేశీయ చిత్రం 3డీ ఫార్మాట్‌లో ఇంత భారీ సంఖ్యలో విడుదల కావడం ఇదే తొలిసారి. “రోబో 2.0 : రీసర్జన్స్” అనే చైనీస్ టైటిల్‌తో సినిమా అక్కడ విడుదలవుతుంది. ఐమ్యాక్స్ 3డి వెర్షన్‌లో బిగ్గెస్ట్ రిలీజ్ అవుతున్న విదేశీ చిత్రమిదే కావడం విశేషం. “2.0” చిత్రాన్ని 10 వేల థియేటర్స్ (56 వేల స్క్రీన్స్‌లో) విడుదల చేయబోతున్నట్టు లైకా గత ఏడాది డిసెంబర్‌లో అఫీషియల్‌గా ప్రకటించింది. కాగా ఈ చిత్ర అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలు పెట్టారట. నేటి నుండి ఆన్ లైన్‌లో “2.0” టికెట్స్ అందుబాటులో ఉండనున్నాయి. రజనీకాంత్ ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న “దర్బార్” మూవీ వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. మరి అక్కడి ప్రేక్షకులను ఈ చిత్రం ఎంతమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
previous post
ఆమె బిగ్ బాస్ లోకి రెండోసారి ఫుల్లుగా తాగి ఎంట్రీ ఇచ్చింది… కమెడియన్ షాకింగ్ కామెంట్స్