telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బిగ్ బాస్ లో ఒకే బెడ్ పై అమ్మాయి, అబ్బాయి… జనాలు ఫైర్

star maa promo on bigg boss 3

బిగ్ బాస్ రియాలిటీ షో అన్ని భాషలలో విజయవంతంగా కొనసాగుతోంది. తెలుగులో నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షో 11వ వారంలోకి అడుగుపెట్టింది. గతవారం పునర్నవి ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యింది. హిందీలో ఈ షోకు విపరీతమైన పాపులారిటీ రావడంతో తమిళం, తెలుగులోనూ మొదలైంది. 2017లో తమిళ బిగ్‌బాస్ వెర్షన్ చిక్కుల్లో పడింది. విలక్షణ నటుడు కమల్ హాసన్ ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. తమిళనాడు సంప్రదాయాలను దెబ్బతీస్తున్నారంటూ హిందూ మక్కల్ కట్చి అనే సంఘం షోను బ్యాన్ చేయాలని డిమాండ్ చేసింది. ఆ సమయంలో షోలో పాల్గొన్న తమిళ నటులు ఓవియా, నమిత, గంజా కరుప్పు, హారతిలపై పోలీసు కేసు కూడా నమోదైంది. షోలో 75 శాతం దుస్తుల్లేకుండా తిరుగుతున్నారని, నోటి కొచ్చిన బూతులు మాట్లాడుతున్నారని ఆ సంఘం ఆరోపించింది. వారి మాటలు, ప్రవర్తన ఏడు కోట్ల తమిళుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందని మండిపడ్డారు. షోను వెంటనే బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు మళ్లీ సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న షోలో కొత్త రూల్ వివదాస్పదమైంది. బిగ్‌బాస్ చెప్పినట్లుగా ఇందులో పాల్గొనే అమ్మాయిలు, అబ్బాయిలు ఒకే మంచం షేర్ చేసుకోవాలని బిగ్‌బాస్ రూల్ పెట్టింది. ఈ రూల్ వల్ల వారు ఒకరిపై చేతులు, కాళ్లు వేసుకుని మరీ పడుకుంటున్నారు. ఇలాంటి షోల వల్ల ఎటువంటి ఉపయోగం లేదని, పైగా సమాజంపై చెడు ప్రభావం చూపుతుందని తాజాగా ట్రేడర్స్ యూనియన్ ఆరోపిస్తోంది. ఈ మేరకు ఐ అండ్ బీ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు సంఘ సభ్యులు లేఖ రాశారు. ఈ షో వల్ల భారతదేశం సంప్రదాయాలు, విలువలు మంటగలిసిపోతున్నాయని వాపోతున్నారు. ఈ షోను ప్రసారం చేయడానికి ముందు సెన్సార్ బోర్డుకు చూపించి వారు సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాతే ప్రసారం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ షోను అందరూ చూసేలా కాకుండా ఏజ్ లిమిట్‌ ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ట్రేడర్స్ సంఘం సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం నడుస్తున్న బిగ్‌బాస్ సీజన్ 13 షోలో BFF (బెడ్ ఫ్రెండ్ ఫరెవర్) అనే కాన్సెప్ట్ చాలా అసహ్యంగా ఉంది. అది టెలివిజన్ విలువలను దెబ్బతీస్తోంది. అదీకాకుండా ఈ షోను ప్రైమ్ టైంలో ప్రసారం చేస్తున్నారు. ఆ సమయంలో అన్ని వర్గాల వారు టీవీ ముందే కూర్చుని ఉంటారు. అలాంటప్పుడు ఒకే మంచంపై అమ్మాయిని అబ్బాయిని పడుకోబెట్టడం లాంటి నీచమైన కాన్సెప్ట్స్ పెట్టకూడదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related posts