telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మనమంతా ఒక స్క్రిప్ట్ రాసుకుంటే దేవుడు మరొక స్క్రిప్ట్ రాస్తాడు : మంచుమనోజ్

manoj

ప్రపంచాన్ని పీడించుకు తింటోన్న కరోనా మహమ్మారిని మన దేశం నుంచి తరిమికొట్టే ప్రయత్నంలో 21 రోజులపాటు లాక్‌డౌన్ విధించారు. నిజానికి ఇది మనమంచికే. మనల్ని, మన పిల్లల్ని, తల్లిదండ్రులని, మన చుట్టూ ఉండేవాళ్లని కాపడటానికే. సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. ప్రజల్లో అసహనాన్ని పారదోలడానికి, కరోనాపై వారిలో అవగాహన కల్పించడానికి ప్రభుత్వాలతో పాటు సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో చైతన్యం నింపుతున్నారు. ఇప్పటికే చాలా మంది సినిమా స్టార్లు కరోనాపై అవగాహన కల్పిస్తూ వీడియోలు చేశారు. ఇప్పుడు తన మేనకోడలితో కలిసి ఒక వీడియో సాంగ్‌తో మన ముందుకు రాబోతున్నాడు మంచు మనోజ్. మన కోసం వారి ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తోన్న డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు ఈ పాటను అంకితమివ్వనున్నట్టు మనోజ్ తెలిపారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మూడు సంవత్సరాల విరామం తర్వాత మంచి సినిమాతో మిమ్మల్ని పలుకరిద్దాం అనుకున్నాను. మనమంతా ఒక స్క్రిప్ట్ రాసుకుంటే దేవుడు మరొక స్క్రిప్ట్ రాస్తాడు. ‘యాక్షన్’ అన్న పదం వినే అదృష్టాన్ని ఇంకొన్ని రోజులు దూరం జరిపాడు. వచ్చే వారం డాక్టర్లకు, పోలీసులకు, ఆర్మీకి, పారిశుధ్య కార్మికులకు, ముఖ్యంగా వాళ్ళు చేసే త్యాగానికి ఒక పాట అంకితం చేస్తున్నాను.అని మనోజ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Related posts