రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రానికి పోటీగా తేజ మరో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఇక్కడ ఆర్ఆర్ఆర్ అంటే ‘రాక్షస రాజ్యంలో రావణాసురుడు’. రానాతో తేజ తీయబోయే చిత్రానికి ఇదే టైటిల్ అనుకుంటున్నారట. ‘నేనే రాజు నేనే మంత్రి’ తర్వాత తేజ, రానా కాంబినేషన్‌లో వస్తోన్న రెండో సినిమా ఇది. ఈ చిత్రంలో రానా సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీఫియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. ఈచిత్రాన్ని కూడా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో డి.సురేష్ బాబు నిర్మించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం రానా హీరోగా నటించిన ‘అరణ్య’ విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు ‘విరాట పర్వం’ షూటింగ్ దశలో ఉంది. వీటితో పాటు రానా గుణశేఖర్ దర్శకత్వంలో ‘హిరణ్యకశ్యప’ అనే ప్యాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నాడు.
previous post
ఆ స్టార్ హీరోతో కలిసి నటించడం సౌకర్యంగా ఉంటుంది : శ్రియ