telugu navyamedia
సినిమా వార్తలు

భీమ్లా నాయక్ పై ఆర్జీవీ రివ్యూ ..

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు థియేటర్లలో విడుదలైంది. తొలి షో నుంచి సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో థియేటర్లు దద్దరిల్లుతున్నాయి.

పవన్‌ కెరీర్‌లో మరో సూపర్‌ హిట్‌ పడిందని పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌తో పాటు ఇతర సెలబ్రిటీలు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా భీమ్లా నాయక్‌ చిత్రంపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

తాజాగా వివాద‌స్ప‌ద‌ దర్శకుడు రామ్‌ ఏం చేసినా సెన్సేషనే .ఎప్పటికప్పుడు పవన్‌ కళ్యాణ్‌ను, మెగా ఫ్యామిలీని టార్గెట్‌ చేస్తూ పోస్టులు చేసే వర్మ.. .తాజాగా ‘భీమ్లా నాయక్’ రివ్యూ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చారు. సినిమా ఎలా ఉందన్న విషయాన్ని వెల్లడిస్తూ ఆర్జీవీ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్టు వైరల్ అవుతోంది.

ఈ సందర్భంగా వర్మ ట్వీట్‌ చేస్తూ.. ‘నేను ముందు నుంచి చెబుతున్నట్లు భీమ్లా నాయక్‌ సినిమాను హిందీలోనూ విడుదల బాగుంటుంది. ఈ సినిమా హిందీలో కచ్చితంగా సెన్సేషన్‌ క్రియేట్ చేస్తుంది’ అంటూ ట్వీట్‌ చేశారు.

ఇక మరో ట్వీట్‌లో.. ‘భీమ్లా నాయక్‌ ఒక మెరుపు, పవన్‌ కళ్యాణ్‌ సునామి. రానా కూడా పవన్‌తో పాటీ పడీ నటించారు. మొత్తం మీదం భీమ్లానాయక్‌ భూకంపాన్ని సృష్టించింది’ అంటూ తనదైన శైలిలో రాసుకొచ్చారు వర్మ.

ఎప్పుడూ నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. ఈసారి పవన్ సినిమాపై పొగడ్తల వర్షం కురిపించడం ఆయన అభిమానులను, నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Related posts