బాలీవుడ్‌లో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలతో తాప్సీ పన్ను తనకంటూ ఓ ఇమేజ్‌ను ఏర్పరుచుకొన్నారు. కథాబలం ఉన్న చిత్రాల్లో నటిస్తూ అవార్డుల రివార్డులు అందుకొంటున్నారు. అయితే కరోనా థర్ఢ్ వేవ్ ముంచుకొస్తున్న తరుణంలో టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని భాషల చిత్రాలు ఓటీటీ బాట పట్టాయి. సల్మాన్ ఖాన్ లాంటి పెద్ద హీరోల సినిమాలు సైతం నేరుగా ఓటీటీలో విడుదలవుతున్నాయి.
అందులో భాగంగానే మరో బాలీవుడ్ చిత్రం ఇదే బాట పట్టినట్టు తెలుస్తోంది. తాప్సి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రష్మి రాకెట్’. ఈ సినిమా జీ5లో దసరా కానుకగా విడుదల కానున్నట్టు సమాచారం. రూ.58 కోట్లకు డీల్ కుదిరినట్టుగా వార్తలొస్తున్నాయి. ఈ ఏడాది ఆరంభంలోనే ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసింది తాప్సి. ఇందులో ఆమె రన్నింగ్ క్రీడాకారిణిగా నటిస్తోంది.
ఈ సినిమాను యూరీ: సర్జికల్ స్ట్రైక్స్ లాంటి చిత్రాన్ని రూపొందించిన ఆర్ఎస్వీపీ నిర్మిస్తున్నది. ఈ చిత్రానికి రోని స్క్రూవాలా, నేహా ఆనంద్, ప్రంజల్ ఖాండియా నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, ఆకాశ్ ఖురానా దర్శకత్వం వహిస్తున్నారు. కాగా..ప్రస్తుతం ఆమె కంటెంట్‌కు స్కోప్ ఉన్న లూప్ లపేటా, అన్నాబెల్లే సుబ్రమణ్యం, జనగణమన, దోబారా, ఏలియన్, శభాష్ మిత్తు, మిషాన్ ఇంపాజిబుల్, బ్లర్ సినిమాల్లో నటిస్తున్నారు.
ఏ క్షణమైనా సినిమాలోంచి తప్పుకుంటా… డాక్టర్ అవుతా.. : సాయి పల్లవి