భీమ్లా నాయక్ సినిమా విషయంలో ఏపీ ప్రభుత్వఏ వ్యవహరిస్తున్న తీరుపై నటుడు ప్రకాశ్‌రాజ్ తప్పు పట్టాడు.పవన్ కళ్యాణ్ సినిమాను సపోర్ట్ చేస్తూ.. ఆయన చేసిన ట్వీట్ చేశారు
సృజన.. సాంకేతికత మేళవించిన రంగం సినిమా అన్నారు. సినీరంగంపై అధికార దుర్వినియోగం, ఆధిపత్య ధోరణి ఏంటి? అని ప్రశ్నించారు. చిత్ర పరిశ్రమను క్షోభపెడుతూ ప్రోత్సహిస్తున్నామంటే నమ్మాలా? అని నిలదీశారు.
ఏదైనా ఉంటే రాజకీయ క్షేత్రంలో చూసుకోవాలి.. కానీ కక్ష సాధింపులు బాక్సాఫీస్ వద్ద ఎందుకు..? అని ట్వీట్ చేశారు. ఎంత ఇబ్బందిపెట్టినా ప్రేక్షకుల ఆదరాభిమానాలకు అడ్డుకట్ట వేయలేరని ప్రకాశ్‌రాజ్ అన్నారు.
ఈ క్రమంలోనే ఈయన చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. #BheemlaNayak, #GovtofAndhrapradesh హ్యాష్ ట్యాగ్‌తో చేసిన ట్వీట్ సంచలనం రేపుతుంది.
#BheemlaNayak .. #GovtofAndhrapradesh please put an end to this onslaught..let cinema thrive 🙏🏻🙏🏻🙏🏻#JustAsking pic.twitter.com/eZxpVYYZbI
— Prakash Raj (@prakashraaj) February 27, 2022
ఆఫీస్ బాయ్‌కి ఎక్కువ యాంకర్‌కి తక్కువ అన్నట్లు చూసారు : నటి అనిత చౌదరి