telugu navyamedia
సినిమా వార్తలు

చిన్నారి రాకతో మా ప్రపంచమే మారిపోయింది: శ్రియ

నటి శ్రియ షాకింగ్‌ విషయాన్ని బయటపెట్టింది. గతేడాది తాను పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ‘2020 ప్రపంచం మొత్తం తలకిందులు అయిపోయింది. ఒక ఏడాదంతా అందరూ క్వారంటైన్‌లో ఉండిపోయారు. కోవిడ్‌ కారణం‍గా అందరూ ఎన్నో గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నారు. కానీ మా జీవితంలో మాత్రం అద్భుతం జరిగింది. చిన్నారి రాకతో మా ప్రపంచమే మారిపోయింది. ఏంజిల్‌ లాంటి చిన్నారిని మాకు ప్రసాదించినందుకు ఆ దేవుడికి ఎంతో రుణపడి ఉంటాను’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా శుభవార్తను అభిమానులతో పంచుకుంది.

కాగా 2018లో రష్యన్‌ క్రీడాకారుడు, బిజినెస్‌ మ్యాన్‌ ఆండ్రీ కోషీవ్‌ను శ్రియ పెళ్లాడిన సంగతి తెలిసిందే. గతేడాది స్పెయిన్‌లోని బోర్సిలోనాలోనే శ్రియ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సంవత్సరం వరకు శ్రియ తన ప్రెగ్నెన్సీ గురించి బయటపెట్టకపోవడం గమనార్హం.

Related posts