telugu navyamedia
ఆంధ్ర వార్తలు

విశాఖలో మిలాన్ -2022 విన్యాసాలు..

విశాఖ మ‌హాన‌గ‌రం వేదిక‌గా మ‌రో అంత‌ర్జాతీయ కార్య‌క్ర‌మం ప్రారంభ‌మైంది. మిలాన్‌-2022 సంద‌ర్భంగా విదేశీ అతిథుల‌తో న‌గ‌రం క‌ల‌క‌లాడుతుంది. స‌ముద్రంలో నౌక‌లు ఆకాశంలో విమానాల విన్యాసాలుతో సిటీలో పండుగ‌వాతావ‌ర‌ణం నెల‌కొంది.

మిలాన్‌-2022 ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌ను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు.  ఐఎన్ఎస్-విశాఖ నౌకను సీఎం జాతికి అంకితం చేశారు.

ఆర్కే బీచ్‌లో నేవీ ఆధ్వర్యంలో పరేడ్‌ ప్రారంభమైంది. సముద్ర యుద్ధ విన్యాసాలు, గగనతల వాయుసేన విన్యాసాలను ప్రదర్శిస్తున్నారు.  ఈ కార్యక్రమంలో 39 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Visakhapatnam Milan-2022 CM Jagan dedicated INS-Visakha to nationఅంత‌కుముందు..తూర్పు నౌకాదశ కేంద్రానికి చేరుకున్న ఆయన నౌకాదళ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

సీఎంతో పాటు స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నబాబు, అవంతి శ్రీనివాస్‌, ఎంపీలు విజయసాయిరెడ్డి, ఎం.వి.వి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Related posts