మత్తు కళ్ళ బెంగాలీ భామ రియాసేన్ తెలుగు, తమిళ్‌తోపాటు హిందీ, బెంగాళీ సినిమాల్లో కూడా నటించింది. మోతాదుకు మించిన గ్లామర్ ఒలకబోసినా గుర్తింపురాలేదు. మంచు మనోజ్ నటించిన నేను ‘మీకు తెలుసా’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైంది రియా సేన్. ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో అవకాశాలను దక్కించుకోలేక పోయింది. అటు తమిళంలో కూడా నిలదొక్కుకోలేకపోయింది. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌లో తన అందాలను ప్రదర్శిస్తూ హాట్ ఫోటోలను పోస్టు చేస్తూ రచ్చ చేస్తోంది. నాలుగు పదుల వయస్సు మీద పడుతున్నా తరగని అందాలతో అభిమానులకు కనులవిందు చేస్తోంది. ఇన్స్టాగ్రామ్ లో తాజాగా వ్యాయామం చేస్తూ నడుమును విల్లులా వంచిన పిక్ షేర్ చేసింది. ఈ ఫోటోకి క్షణాల్లో భారీ సంఖ్యలో లైకులు వచ్చాయి.
previous post
next post
రైతులను ఉగ్రవాదులతో పోల్చిన కంగనా… కేసు నమోదు