telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

షాప్ లో దొంగలు పడ్డారు..డబ్బులు కాదు, ఉల్లిపాయలు ఎత్తుకెళ్లారు.. అది ఉల్లిదెబ్బ అంటే..

onions

ఉల్లి చేసిన మేలు తల్లికూడా చేయదు అంటారు. అంతగా దానిని వంటలో వాడుతుంటారు. అలాంటి దాని ధర ఆకాశాన్ని అంటితే ఇంకేమైనా ఉందా..కూరగాయలు తెచ్చుకునే స్తొమత లేనివాళ్లు, ఉల్లిగడ్డలో కారం చేసుకొని దానితోనే భోజనం కానిచేస్తారు. అందుకే దానికి అంత డిమాండ్. అయితే ప్రస్తుతం ధరలు ఆకాశాన్ని అంటున్న నేపథ్యంలో ఒక విచిత్రం చోటుచేసుకుంది.. పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు మిడ్నాపూర్ జిల్లా సుతహతా ప్రాంతంలో ఓ అరుదైన దొంగతనం జరిగింది.

అక్షయ్ దాస్ అనే వ్యక్తి కూరగాయల షాపు నిర్వహిస్తున్న క్రమంలో షాపు తెరవగానే వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉండడంతో షాపులో దొంగలు పడ్డారని గ్రహించి హడావిడిగా క్యాష్ కౌంటర్ చెక్ చేసుకోగా దాంట్లోని డబ్బంతా అలానే ఉండడంతో ఒక్క నిమిషం ఊపిరిపీల్చుకుని దొంగలు ఏమి తీసుకువెళ్లారో అని వెతకగా షాపులోని 50 వేలు విలువ చేసే ఉల్లిపాయలు కనబడకపోవడంతో లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ప్రస్తుతం బెంగాల్‌లో ఉల్లి ధరలు అమాంతంగా పెరిగిపోయి కిలో ఉల్లి 100 పలకడంతో దొంగలు డబ్బుల కంటే ఉల్లిపాయలే మేలని వాటిని పట్టుకుపోయారు.

Related posts