telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

జిమ్ లో బిగ్ బాస్ బ్యూటీ పునర్నవి… వీడియో వైరల్

Punarnavi

బిగ్ బాస్ బ్యూటీ పునర్నవి భూపాలం డిఫరెంట్ క్యాస్ట్యూమ్స్‌తో బిగ్ హౌస్‌లో జిగేల్ అన్పించింది. బిగ్ బాస్ తరువాత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంది. తన ఇన్ స్టాగ్రామ్‌తో హాట్ హాట్ అందాలను బహిర్గత పరుస్తూ రోజుకో ఫొటోను షేర్ చేసి సెగలు పుట్టిస్తోంది. ఈ మధ్యకాలంలో ఆమె షేర్ చేసిన హాట్ పిక్స్ సోషల్ మీడియాను షేక్ చేశాయి. తాజాగా జిమ్‌లో పునర్నవి వర్కౌట్ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. కాస్త బొద్దుగా ముద్దుగా ఉండే ఈ బిగ్ బాస్ భామ.. స్లిమ్ అయ్యేందుకు వర్కౌట్స్ చేస్తూ చెమటలు చిందిస్తోంది. గ్లామర్ ఫీల్డ్‌లో రాణించాలంటే ఫిట్ నెస్ తప్పనిసరైన పరిస్థితుల్లో ఒళ్లు ఒంచక తప్పదు మరి. అన్నట్టు పునర్నవి భూపాలం నటించిన సైకిల్, ఒక చిన్న విరామం చిత్రాలు త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ‘ఉయ్యాల జంపాలా’, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’, ‘పిట్టగోడ’, ‘ఎందుకో ఏమో’ ఇలాంటి చిత్రాల్లో నటించినా రాని గుర్తింపు ‘బిగ్ బాస్’ షోతో దక్కించుకుంది పునర్నవి భూపాలం. గ్లామర్ డాల్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టి 11 వారాలు పాటు కలర్ ఫుల్ లుక్స్‌తో బిగ్ బాస్ హౌస్‌తో పాటు ఆడియన్స్‌కి హాట్‌నెస్ అందించిన పునర్నవి భూపాలం ప్రస్తుతం క్రేజీగా మారింది. బిగ్ బాస్ సీజన్‌ 3లో తనకు టైటిల్ రాలేకపోయినప్పటికీ తనతో లవ్ ట్రాక్ నడిపిన రాహుల్‌కి సపోర్ట్ చేసి తన విజయంలో కీలకం అయ్యింది పునర్నవి భూపాలం.

Related posts