కేంద్రప్రభుత్వంపై ప్రధాన విమర్శలలో ఒకటైన రాఫెల్ యుద్ధ విమానం బెంగుళూరు లో తళుక్కుమంది. అక్కడ జరిగే ఎయిర్ షో లో ఈ విమానాన్ని కూడా ప్రదర్శనకు ఉంచారు. ఏరో ఇండియాలో ప్రదర్శన ఇచ్చేందుకు ఫ్రాన్స్ వైమానిక దళానికి చెందిన రెండు రాఫెల్ జెట్ ఫైటర్లను బెంగళూరుకు తరలించారు. ఏరో షోకు సన్నాహకంగా నిన్న జరిగిన విన్యాసాల్లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన రెండు సూర్య కిరణ్ ఏరోబేటిక్ విమానాలు ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో వింగ్ కమాండర్ సాహిల్ గాంధీ దుర్మరణం పాలయ్యారు. ఆయన మరణానికి సంతాపంగా రాఫెల్ విమానాన్ని సాధారణ వేగంతో నడిపారు. ప్రమాదం నేపథ్యంలోనే సూర్య కిరణ్ ఏరోబేటిక్స్ బృందం ప్రదర్శనకు దూరంగా ఉంది.
రాఫెల్‌తో పాటు స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన తేజస్ కూడా ప్రదర్శనలో పాల్గొంది. లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌కు తేజస్‌ను భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్ నామకరణం చేశావరు. ఈ సందర్భంగా అటల్‌జీకి నివాళుర్పించారు.
#WATCH: #Rafale combat aircraft fly at low speed to pay tribute to Wing Commander Sahil Gandhi who lost his life yesterday in a mid-air collision during rehearsal in a Surya Kiran Aerobatics Team’s aircraft. pic.twitter.com/OGC3WPPAfM
— ANI (@ANI) February 20, 2019