telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

‘భీష్మ’ సినిమా పై రష్మిక ట్విట్…

nitin bhishma movie teaser

కన్నడ హీరోయిన్ రష్మిక మందన్నకి ఇప్పుడు టాలీవుడ్‌లో ఫుల్‌క్రేజ్ ఉంది. కుర్రహీరోలతో పాటుగా స్టార్ హీరోలతోను కలిసి నటిస్తోంది. ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మలు టాలీవుడ్లో సక్సెఫుల్ హీరోయిన్ గా చలామణి అవుతున్నారు. అందువల్ల బాగా డిమాండ్ పెరిగింది. రష్మిక మందన్న కూడా ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాలో ‘మైండ్ బ్లాక్’ సాంగ్ లో హాట్ గా గ్లామర్ ఒలకబోస్తూ కిర్రాక్ స్టెప్పులేసి యూత్ మతులు పోగొట్టింది. ఈ సినిమాతో సూపర్‌హిట్ అందుకున్న కన్నడ భామ రష్మిక ఆ వెంటనే ‘భీష్మ’ తో మరో బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకుంది. నితిన్‌తో కలిసి రష్మిక నటించిన ‘భీష్మ’ గతేడాది ఫిబ్రవరిలో విడుదలై ఘనవిజయం సాధించింది. కాగా నేటితో ‘భీష్మ’ సినిమా ఏడాది పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా రష్మిక సోషల్ మీడియాలో ఆ జ్ఞాపకాలను గుర్తుచేస్తూ పోస్ట్ చేసింది. ‘కాలం చాలా వేగంగా పరిగెడుతోంది, ‘భీష్మ’ విడుదలై అప్పుడే ఏడాది అవుతోంది. ఫిబ్రవరిని నాకు చాలా స్పెషల్‌గా మార్చినందుకు నితిన్‌కు, వెంకీకి ధన్యవాదాలు’ అంటూ రష్మిక తెలిపింది. కాగా వెంకీ కుడుముల దర్శకుడితో రష్మిక-నాగశౌర్య చిత్రం ‘ఛలో’ కూడా ఫిబ్రవరి నెలలోనే విడుదలైంది.

Related posts