telugu navyamedia
రాజకీయ

రష్యాతో చర్చలకు ఉక్రెయిన్ అంగీకారం

*ఉక్రెయిన్ సంక్షోభం నేప‌థ్యంలో కీల‌క ప‌రిణామం..
*ర‌ష్యాతో చ‌ర్చ‌ల‌కు అంగీక‌రించిన ఉక్రెయిన్ అధ్య‌క్షుడు..
*బెలారస్‌లో గొమెల్‌లో చ‌ర్చ‌ల‌కు ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ అంగీకారం..
*బెలారస్‌లో ఉక్రెయిన్‌తో చర్చలకు క్రెమ్లిన్ సిద్ధం..
*చ‌ర్చ‌లు కోసం బెలారస్ బ‌య‌లుదేరిన ఉక్రెయిన్ బృందం..

రష్యాతో చర్చలకు ఉక్రెయిన్​ అంగీకరించింది. బెలారస్‌లో చర్చలకు అంగీకరించారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్  స్కీ.చర్చలకు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వోలోదిమిర్‌ జెలెన్‌స్కీ అంగీకరించినట్లు రష్యా మీడియా వెల్లడించింది.

ఈ నేపథ్యంలో చర్చల కోసం బెలారస్ బయల్దేరింది ఉక్రెయిన్ బృందం. ఇరు దేశాల ఉన్నతాధికారుల మధ్య సమావేశం బెలారస్​లోనే జరగనున్నట్లు రష్యా అధికారిక మీడియా వెల్లడించింది.

అంతకుముందు రష్యాతో చర్చలు జరపడానికి తమ దేశం సిద్దంగా ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్ స్కీ చెప్పారు. అయితే  తొలుత బెలారస్​లో చర్చలకు ఉక్రెయిన్​.. సుముఖంగా లేనట్లు వార్తలొచ్చాయి.

Related posts