telugu navyamedia
సినిమా వార్తలు

కాజల్, బెల్లంకొండ “సీత” ట్రైలర్

sita movie first look

తేజ ద‌ర్శ‌క‌త్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్, మ‌న్నారా చోప్రా హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం “సీత‌”. ఈ చిత్రంలో ఓ స్పెష‌ల్ సాంగ్‌లో పాయల్ రాజ్ పుత్ నటిస్తోంది. సినిమా క‌థానుసారం కీల‌క స‌మ‌యంలో వచ్చే “బుల్ రెడ్డి…” అనే ఈ స్పెష‌ల్ పెప్పీ మాస్ సాంగ్ ఇటీవలే విడుదలై మాస్ ఆడియెన్స్ స‌హా అన్నీ వ‌ర్గాల ప్రేక్షకుల‌ను మెప్పించింది. ఈ చిత్రంలో సోనూసూద్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న ఈ చిత్రం ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో “నా పేరు సీత నేను గీసిందే గీత.. ప్రాస బాగుంది కదా” అంటూ కాజల్ చెప్పే డైలాగ్, “రావణాసురుడు సీతను ఎత్తుకెళ్లడం తప్పు కాదండి. రాముడి భార్యను ఎత్తుకెళ్లడం తప్పు” అంటూ హీరో విలన్ క్యారెక్టర్ సోనూసూద్ తో చెచెప్పే డైలాగ్, ట్రైలర్ చివర్లో సోనూసూద్ “ఎవడికోసమో.. నీ క్యారెక్టర్ మార్చుకోకు సీత.. అది నేనైనా సరే.. ఆ దేవుడైనా సరే.. రా మంచం ఎక్కు” అంటూ చెప్పే డైలాగులు హైలైట్ గా నిలిచాయి. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ సినిమా మే 24న విడుదల కానుంది.

Related posts