telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అలియా భట్ ఎవరో తెలియదన్న గిబ్స్… అలియా ఏమందంటే ?

Alia

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ భారీ చిత్రాల్లో నటిస్తూ దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. అలియా ప్ర‌స్తుతం హిందీలో “బ్ర‌హ్మాస్త్రా”, తెలుగులో “ఆర్ఆర్ఆర్” చిత్రంలో నటిస్తోంది. ఈ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎవరో దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు హెర్షలే గిబ్స్‌కు తెలియదట. నెటిజన్ల కామెంట్లకు స్పందనగా గిబ్స్ ఈ విషయాన్ని తెలియజేశాడు. గిబ్స్ చేసిన ఓ ట్వీట్‌ను ట్విటర్ లైక్ చేసింది. దానికి గిబ్స్ స్పందిస్తూ… “ట్విటర్ మీ ట్వీట్‌ను లైక్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా..?” అంటూ అలియా జీఐఎఫ్‌ ఇమేజ్‌ను షేర్ చేశాడు. దాంతో ఆలియా అభిమానుల నుంచి గిబ్స్‌కు మెసేజ్‌లు పోటెత్తాయి. “ఈమె ఎవరో తెలుసా?” అంటూ ప్రశ్నల వర్షం కురిసింది. దానికి స్పందించిన గిబ్స్ “ఆమె తెలియదు. కానీ ఇమేజ్ బాగుంది” అని ట్వీట్ చేశాడు. కొద్ది సేపటి తరువాత అలియా గురించి తెలుసుకుని “ఈమె నటి అని తెలియదు. కానీ చాలా అందంగా ఉంది” అని ట్వీట్ చేశాడు. గిబ్స్ ట్వీట్‌కు అలియా స్పందిస్తూ ఫోర్ సిగ్నల్ ఇస్తున్న తన ఇమేజ్‌ని పోస్ట్ చేసింది. దానికి గిబ్స్ స్పందిస్తూ… “నేను ఫోర్లు పెద్దగా కొట్టను మేడమ్.. అన్నీ సిక్స్‌లే” అంటూ ట్వీట్ చేశాడు. ఈ సరదా సంభాషణ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.

Related posts