దేశంలో కరోనా రోజు రోజుకి విజృంబిస్తోంది. కరోనా బారిన పడుతున్న వారిలో ఎక్కువ మంది సినీ సెలబ్రిటీలే ఉన్నారు. ఇప్పటికే పలువురు నటులు కరోనా బారిన పడ్డారు.
తాజాగా బాలీవుడ్‌లో కరోనా కలకలం సృష్టిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ కపూర్ తో సహా ఆయన సోదరి అన్షులా కపూర్‌కు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వీరితో పాటు బాబాయ్ అనిల్ కపూర్ కుమార్తె రియా కపూర్, ఆమె భర్త కరణ్ బూలానీ లకు కూడా కోవిడ్ పాజిటివ్ అని తేలింది.
దీంతో వారంతా ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని రియా కపూర్ తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
అర్జున్ కపూర్ రెండవసారి కోవిడ్ బారీన పడ్డారు. 2020 సెప్టెంబర్ లో అర్జున్ కపూర్ కి తొలిసారి కరోనా సోకింది. అప్పుడు అర్జున్ కపూర్ చికిత్స తీసుకుని కోలుకున్నారు.
దీనితో ముంబై మున్సిపల్ అధికారులు అర్జున్ కపూర్ నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ ని శానిటైజ్ చేసి సీజ్ చేసినట్లు ఓ వీడియో బయటకు వచ్చింది.. అర్జున్ కపూర్ ఫ్యామిలీతో సన్నిహితంగా ఉన్న వారికీ కూడా కోవిడ్ పరీక్షలు నిర్వహించనున్నారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. అర్జున్ కపూర్ ప్రేయసి మలైకా అరోరా కూడా కొవిడ్ పరీక్షలు చేసుకోగా ఆమెకు నెగెటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కపూర్ ఫ్యామిలీకి కరోనా రావడంతో బాలీవుడ్ అంతా షాక్ కి గురవుతున్నారు.