telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“సీత” ప్రీమియర్ షో టాక్

Sita

తేజ ద‌ర్శ‌క‌త్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్, మ‌న్నారా చోప్రా హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం “సీత‌”. ఈ చిత్రంలో ఓ స్పెష‌ల్ సాంగ్‌లో పాయల్ రాజ్ పుత్ నటిస్తోంది. ఈ చిత్రంలో సోనూసూద్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న ఈ చిత్రం ట్రైలర్ ను ఇటీవలే విడుదల చేయగా మంచి స్పందన లభించింది. ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే యూఎస్ ప్రీమియర్ షోలు పూర్తయిన నేపథ్యంలో ఈ సినిమా టాక్ ఉందొ చూద్దాం.

20 సంవత్సరాలు జ‌నాల‌కు దూరంగా ఉన్న ఓ అబ్బాయి ఈ జ‌నార‌ణ్యంలోకి వచ్చి, డ‌బ్బే స‌ర్వ‌స్వం అనుకునే అమ్మాయిని ఇష్టపడితే ఏం జరుగుతుంది ? అనేదే చిత్రకథ. ఈకథకు దర్శకుడు కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ను కలిపినప్పటికీ అంతగా వర్కౌట్ కాలేదనే టాక్ వినిపిస్తోంది. కథ మొత్తం కాజల్ చుట్టూనే తిరుగుతుందని, ఆ పాత్రకు పూర్తి న్యాయం చేసిందని టాక్. హీరోగా బెల్లంకొండ నటన కాస్త అతిగా ఉందని టాక్. విలన్ గా సోనూసూద్ నటన ఆకట్టుకుంది.తనికెళ్లభరణి క్యారెక్టర్ మెప్పిస్తుంది. బిత్తిరి సత్తి కామెడీ ఓ మోస్తరుగా ఉందని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ మెప్పిస్తుంది. సెకండ్ హాఫ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సింది. పాటలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంత మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Related posts