అక్షయ్ కుమార్ తన దాతృత్వం మరోసారి చాటుకున్నాడు. అలాగే, దేశ భద్రతా దళాలపై తనకున్న గౌరవాన్ని కూడా మళ్లీ ఆయన ఋజువు చేసుకున్నాడు. జూన్ 16న జమ్మూలోని లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద ఉన్న తులైల్ ప్రాంతాన్ని సందర్శించాడు. అక్కడి బీఎస్ఎఫ్ జవాన్లతో మాటామంతీ సాగించిన ఆయన స్కూల్ భవనం కోసం కోటి రూపాయలు విరాళం ప్రకటించాడు!
మారుమూల పల్లెలో అక్షయ్ విరాళంతో నిర్మించబోయే పాఠశాలకి ఆయన తండ్రి హరీ ఓం పేరును పెట్టనున్నారు. అయితే, జమ్మూలోని బందిపోరా సెక్టార్ లో వీర జవాన్లను కలవటం ఎప్పటికీ మరిచిపోలేని జ్ఞాపకం అంటూ సొషల్ మీడియాలో ఖిలాడీ స్టార్ పోస్టు కూడా పెట్టాడు. నిజమైన హీరోల్ని కలవటంతో నా హృదయం వారిపట్ల గౌరవంతో నిండిపోయింది అని కూడా కుమార్ అన్నాడు.
త్వరలో సస్పెన్స్ థ్రిల్లర్ ‘బెల్ బాటమ్’తో జనాల్ని ఎంటర్టైన్ చేయనున్న అక్షయ్ కుమార్ గతంలోనూ భద్రాత దశాలకి భారీ విరాళాలు ప్రకటించాడు. కరోనా కల్లోలం సమయంలోనూ పోయిన సంవత్సరం ఆయన భారీ మొత్తం మోదీ ప్రభుత్వానికి అందజేశాడు.
జగనన్న చరిత్ర తెలుసుకున్న వరల్డ్ బ్యాంక్ ఇక సెలవంది: లోకేశ్