telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సుశాంత్‌ది ఆత్మహత్య కాదు… పక్కాగా ప్లాన్ చేసిన మర్డర్… ‘రా’ మాజీ అధికారి సంచలన వ్యాఖ్యలు

Sushanth

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై భారత అత్యున్నత నిఘా సంస్థ ‘రా’ మాజీ అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ మాజీ అధికారి ఎన్‌కే సూద్ సుశాంత్‌ది ఆత్మహత్య కాదని అది పక్కాగా ప్లాన్ చేసిన మర్డర్ అని అన్నారు. ఆయన ఒక వీడియోలో మాట్లాడుతూ సుశాంత్‌ని అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ముఠానే హత్య చేసిందని ఆరోపించారు. దీని వెనుక దావూద్ ప్రమేయం కూడా ఉందని ఆయన ఆన్నారు. పక్కా ప్రణాళికతోనే సుశాంత్‌ని హతమార్చారన్నారు. దావూద్ ప్రస్తుతం ముంబైలో లేకపోయినప్పటికీ అతనికి ముంబై పైనా… బాలీవుడ్‌పైన ఇప్పటికీ గట్టి పట్టు ఉందన్నారు. చాలామంది బాలీవుడ్ సెల్రబిటీలు..దావూద్ విదేశాల్లో ఏర్పాటు చేసిన పార్టీలకు వెళ్లి వస్తుంటారని తెలిపారు. అంతే కాకుండా ఐఎస్ఐకు ఫండ్ కూడా ఇస్తుంటారని సూద్ తెలిపారు. దానికి బదులుగా సెలబ్రిటీలు ఆ తర్వాత అధిక మొత్తంలో డబ్బులు కూడా పొందుతారన్నారు. సుశాంత్‌కు ప్రాణ హానీ ఉంది కాబట్టే ఆయన తరచూ సెల్ ఫోన్ నెంబర్లు మారుస్తూ వచ్చాడన్నారు. అతడికి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయన్నారు. లేకుంటే సుశాంత్ 50 సిమ్ కార్డులు ఎందుకు మార్చాల్సి వచ్చిందని ప్రశ్నించారు. అతడ్ని ఎవరో చంపేస్తారన్న భయంతోనే సుశాంత్ మారుమూల ప్రాంతాలకు ఎక్కడకో వెళ్లి కారులో పడుకున్నాడన్న విషయాన్ని కూడా సూద్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. సుశాంత్‌ను ప్రొఫెషనల్ కిల్లర్స్ హతమర్చారు. అందుకే పక్కా స్కెచ్ వేసి సుశాంత్ ఇంటి ఆవరణలోని సీసీ కెమెరాల్ని అతని హత్య చేసే ఒకరోజు ముందు నుంచి పనిచేయకుండా చేసేశారు. సుశాంత్ ఇంటికి సంబంధించిన డూప్లికేట్ కీని కూడా మిస్ ప్లేస్ అయ్యేలా చేశారు. ఇవన్నీ సాక్షాలు చాలు సుశాంత్ హత్యకు గురయ్యాడని చెప్పాడానికి అన్నారు.. మాజీ అధికారి సూద్. సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి, అతని స్నేహితుడు సందీప్ సింగ్, ఇంట్లో పనిచేసే సిబ్బందికి సుశాంత్‌కు పొంచి ఉన్న ముప్పు గురించి బాగా తెలుసన్నారు. అంతా తెలిసే అతడ్ని అందరూ దూరం పెట్టి… సుశాంత్‌ను ఒంటరి చేశారన్నారు. సూద్ మాట్లాడుతూ బాలీవుడ్ ప్రముఖుల పేర్లు కూడా ప్రస్తావించారు. సల్మాన్ ఖాన్, కరణ్ జోహర్ వంటి వాళ్ల పేర్లు కూడా ప్రస్తావించారు. ఈ కేసును విచారిస్తున్న ముంబై పోలీసులపై కూడా సూద్ విమర్శలు గుప్పించారు. నిజాయితీతో సుశాంత్ కేసును విచారిస్తున్నమాని పైకి ముంబై పోలీసులు చెబుతున్నారని.. కానీ వాళ్లు కూడా నేరస్థుల్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మొత్తం మీద రా మాజీ అధికారి సుశాంత్ మరణంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి సినీ ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్‌గా మారాయి.

Related posts