టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి తరువాత కూడా అదే జోష్‌తో ఉంది. గత ఏడాది అక్టోబరు 30న వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న కాజల్ ఆ వెంటనే సినిమాల షూటింగ్స్‌తో బిజీ అయిపోయింది. ఇప్పుడు కాస్త టైమ్ దొరకడంతో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంది. శ్రావణమాసం కావడంతో తమ దాంపత్య జీవితం బాగుండాలని ‘హర్యాలీ తీజ్’ (భర్త ఆయురారోగ్యాల కోసం పెళ్లయినవాళ్లు, మంచి భర్త రావాలని పెళ్లి కాని అమ్మాయిలు నార్త్‌లో జరుపుకునే పండగ) ఫెస్టివల్‌ను జరుపుకున్నారు. రోజంతా ఉపవాసం ఉన్న కాజల్.. పండగ చేసుకున్న ఫొటోలను ‘ఫస్ట్ తీజ్.. హర్యాలీ తీజ్’ అంటూ సోషల్ మీడియాలో షేర్ చేశారు కాజల్. ఈ ఫొటో కాజల్ లుక్ ఆకట్టుకుంటుంది. ఇక సినిమాల విషయానికొస్తే ఈ అమ్మడు.. ఉమ, ఘోస్టీ, కరుంగాప్పియమ్, హే సినామిక షూటింగ్‌లను పూర్తి చేసిన ఆమె చిరంజీవితో ‘ఆచార్య’, నాగార్జునతో ఓ సినిమా చేస్తున్నారు.
previous post
next post
ఆ స్టార్ హీరోని పెళ్ళి చేసుకుని ఉండేదానిని… రకుల్ కామెంట్స్