telugu navyamedia
సినిమా వార్తలు

నా సినీ రంగ ప్రవేశంపై అనుమానాలు : విజయశాంతి

vijayashanthi fires data missing issue

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, రశ్మిక మందన్న జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ” సరిలేరు నీకెవ్వరు” అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. విజయశాంతి దాదాపు 13 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఆమె ఇటీవల ప్రకటించారు. ఆ ప్రకటనపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట. ఈ విషయం ఆమె దృష్టికి రావడంతో సోషల్‌మీడియా వేదికగా విజయశాంతి తన స్పందనను తెలియజేశారు.

‘‘నేను 13 ఏళ్ల తర్వాత సినిమాల్లో నటిస్తున్నానని ప్రకటించడంపై అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందన వస్తోంది. నేను మరలా సినీరంగ ప్రవేశం చేయడంపై కొందరు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సినిమాలలో నటిస్తే ఇక రాజకీయాలను పట్టించుకోరా అనే అనుమానం కొందరికి రావచ్చు .ఈ సందర్భంగా నేను ఒక విషయం స్పష్టం చేయదలచుకున్నాను. నాకు సినిమాల్లో నటించే అవకాశం ఆరు నెలల కిందటే వచ్చింది. కానీ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ నన్ను స్టార్ క్యాంపెయినర్ గాను, క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ గాను నాకు ప్రచార బాధ్యతలను అప్పగించింది. నాకు అప్పగించిన పని పూర్తయ్యేవరకు నేను సినిమాల్లో నటించడానికి అంగీకరించలేదు. అది రాజకీయాలపై నాకున్న కమిట్మెంట్. నా రాజకీయ ప్రస్థానానికి సంబంధించి ఇదే విధంగా కొన్ని ప్రశ్నలు లేవనెత్తె వాళ్లు కూడా ఉన్నారు. 2014 నుంచి 2018 వరకు కాంగ్రెస్‌లో రాములమ్మ ఆక్టివ్‌గా లేరని కొందరు చేసే కామెంట్స్ నా దృష్టికి వచ్చాయి. దీనికి కూడా సమాధానం చెప్పాలని అనుకుంటున్నాను. పార్టీ అప్పగించిన పని ఏదైనా నేను చిత్తశుద్ధితో చేశాను. ఎన్నికలకు ముందు నాలుగేళ్లపాటు నేను పార్టీ చెప్పిన పనులను తూచా తప్పకుండా చేయడం వల్లే నాకు ప్రచార కమిటీ చైర్మన్ బాధ్యతలను అప్పగించారు అనే విషయాన్ని గుర్తించాలి. కాంగ్రెస్ పార్టీ పరంగా చేసే పనులన్నీ ప్రజల్లోకి వచ్చి చేయకపోవచ్చు.. అంతమాత్రాన రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు భావించకూడదు.’’ అని విజయశాంతి పోస్ట్ చేశారు.

Related posts