telugu navyamedia
సినిమా వార్తలు

ప్రొడక్షన్ మేనేజర్ దగ్గర మోసపోయిన ప్రముఖ హాస్యనటుడు

Senthil

ప్రముఖ తమిళ హాస్య నటుడు సెంథిల్‌. సాలిగ్రామంలోని భాస్కర్ కాలనీలో ఉన్న సెంథిల్ ఫ్లాట్‌ను సహాయరాజ్ అద్దెకు తీసుకున్నాడు.సెంథిల్‌ ఫ్లాట్‌తో కలిపి ఆ అపార్ట్‌మెంట్‌లో మొత్తం 10 ఫ్లాట్స్ ఉన్నాయి. అపార్ట్‌మెంట్ మొత్తాన్ని అద్దెకు తీసుకున్నాడు సహాయరాజ్ అనే సినిమా ప్రొడక్షన్ మేనేజర్. సెంథిల్ పోర్షన్‌కు నెలకు రూ.2.60 కోట్లు అద్దె చెల్లిస్తున్నాడు. 2013 నుంచి అద్దెకు ఉంటున్న అతను గత 6 నెలలుగా సరిగా అద్దె చెల్లించడం లేదు. దీనిపై అతనితో మాట్లాడేందుకు ప్రయత్నించినా అతను టచ్‌లోకి రాలేదు. దీంతో నేరుగా అపార్ట్‌మెంట్ వద్దకు వెళ్లగా, సెంథిల్‌కి షాకింగ్ విషయం తెలిసింది. సెంథిల్ ఫ్లాట్‌తో సహా ఆ అపార్ట్‌మెంట్ మొత్తం తనదేనని సహాయరాజ్ దాన్ని లీజుకు ఇచ్చినట్టు తెలిసింది. తన వద్ద అద్దెకు తీసుకుని మరొకరికి లీజుకు ఇవ్వడంపై సెంథిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దానిపై విరుగంబాక్కమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు

Related posts