telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బిగ్ బాస్ కంటెస్టెంట్ పెళ్ళి తేదీ ఖరారు

బిగ్ బాస్-1 కంటెస్టెంట్ అర్చన ఈ షోతో బుల్లితెరపై కూడా గుర్తింపుసంపాదించుకుంది. 2004లో ‘తపన’ అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అర్చ‌న‌. ‘నేను’ సినిమా ఆమెకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమాలో త్రిష స్నేహితురాలిగా నటించి మెప్పించారు అర్చ‌న‌. ఇక అప్పటి నుంచి హీరోయిన్ పాత్రలే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ రాణించారు. ‘శ్రీరామదాసు’, ‘పౌర్ణమి’, ‘యమదొంగ’, ‘ఖలేజా’, ‘బలుపు’ వంటి భారీ చిత్రాల్లో అర్చన నటించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కలిపి సుమారుగా 40 సినిమాల్లో నటించారు. ఆమె ఆఖరిగా నటించిన చిత్రం ‘వజ్ర కవచధర గోవింద’. కాగా… ఇప్పుడు అర్చన పెళ్ళికి సిద్ధమైంది. అర్చ‌న వేద అక్టోబ‌ర్ 3న హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్‌లో ప్రముఖ వ్యాపారవేత్త జగదీశ్‌తో నిశ్చితార్ధం జ‌రుపుకున్న సంగ‌తి తెలిసిందే. వీరి నిశ్చితార్ధ వేడుక‌కి ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు కూడా హాజ‌ర‌య్యారు. ఇక వివాహం నవంబర్ 13న హైదరాబాద్‌లో ఘనంగా జర‌ప‌నున్న‌ట్టు వధూవరుల కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు. పెద్ద‌ల స‌మ‌క్షంలో ఒక్క‌టి కానున్న ఈ జంట‌కి ఆశీర్వ‌చ‌నాలు అందించేందుకు సినీ సెల‌బ్రిటీలు భారీగానే త‌రలిరానున్న‌ట్టు తెలుస్తుంది.

Related posts