నూతన పార్లమెంట్ భవనాల నిర్మాణానికి ఈరోజు భూమిపూజ జరిగింది. ప్రధాని మోడీ పార్లమెంట్ భవనాల నిర్మాణానికి భూమిపూజ చేశారు. దాదాపుగా రూ.971 కోట్లతో పార్లమెంట్ భవనాల నిర్మాణం జరగబోతున్నది. 2022 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో నిర్మాణం చేపట్టబోతున్నారు. స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్లకు గుర్తుగా కొత్త పార్లమెంట్ ను నిర్మిస్తున్నారు. వందేళ్ల అవసరాలకు సరిపోయేలా కొత్త పార్లమెంట్ భవనం ఉండబోతున్నది. అత్యాధునిక సాంకేతికతతో కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం ఉండబోతున్నది. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈరోజు ఎంతో ప్రత్యేకమైన రోజు అని ప్రధాని మోడీ తెలిపారు. సంసద్ మార్గ్ లో పార్లమెంట్ భవనానికి భూమిపూజ జరిగింది. ఇక పార్లమెంట్ భవన నిర్మాణంలో అణువణువునా భారతీయత ప్రతిబింబింస్తుందని అన్నారు. లోక్ సభ పైకప్పు పురివిప్పిన నెమలి ఆకారంలోనూ, రాజ్యసభ పైకప్పు విరబూసిన కమలం ఆకృతిలోనూ ఉండబోతున్నది. ఇక జాతీయ వృక్షమైన మర్రిచెట్టు పార్లమెంట్ అంతర్భాగంగా ఉండబోతున్నది. మరి చూడాలి ఇది చెప్పిన సమయానికి పూర్తవుతుందా… లేదా అనేది.
previous post
కేసీఆర్ పై ఆరోపణలు చేసే నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదు: గుత్తా