ఇండియన్ క్రికెటర్లు హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాలకు పితృవియోగం కలిగిన విషయం తెలిసిందే. వారి తండ్రి, 71 ఏళ్ల హిమాన్షు పాండ్యా గుండె పోటుతో శనివారం వడోదరలో మృతి చెందారు. అయితే… తన తండ్రి హిమాన్షు పాండ్యా మృతిపై క్రికెటర్ హార్దిక్ పాండ్యా సోషల్ మీడియాలో చాలా భావోద్వేగంతో స్పందించాడు. “నువ్వు నా హీరో. నిన్ను కోల్పోవడం నా జీవితంలో కష్టంగా ఒప్పుకోవాల్సిన విషయం. ఎన్నో జ్ఞాపకాలను విడిచి… నువ్వు వెళ్లావు. ప్రస్తుతం నీ కుమారులు ఈ స్థితిలో ఉన్నారంటే దానికి కారణం నువ్వే. నీ కష్టం వల్లే మేము ఈ స్థాయిలో ఉన్నాం. నీ ఆత్మకు శాంతి చేకూరాలి నా కింగ్. లవ్యూ నాన్న” అంటూ హార్ధిక్ పాండ్యా ట్వీట్ చేశాడు. కాగా.. తండ్రి హిమాన్షు మృతి వార్త తెలియగానే… సయ్యద్ ముస్తాక్ అలీ టీ-20 టోర్నీలో బరోడా జట్టుకు సారథ్యం వహిస్తూ నగరంలోనే ఉన్న కృనాల్ ఇంటికి బయలు దేరగా.. ఇంగ్లండ్‌తో సిరీస్ కోసం ముంబైలో సన్నద్ధమవుతోన్న హార్ధిక్ వెంటనే వడోదర చేరుకున్నాడు.
previous post