telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

చంద్రబాబుకు బర్త్ డే విషెస్ చెప్పిన మెగాస్టార్

chiru

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్బంగా మెగాస్టార్ ఓ ట్వీట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుకు ఘనంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కలకాలం మీకు సంతోషం, ఆరోగ్యం ప్రసాదించమని ఆ భగవంతుని కోరుతున్నాను. విషింగ్ యూ ఏ హ్యాపీ 70th బర్త్ డే సార్, మీ విజన్, మీ హార్డ్ వర్క్, మీ అంకితభావం ఎంతో గొప్పవి ’అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. ట్వీట్ తో పాటు గతంలో చంద్రబాబుతో సరదాగా దిగిన ఒక ఫోటోను కూడా చిరు షేర్ చేశారు. మరో వైపు టీడీపీ అధినేత పుట్టినరోజు వేడుకల్ని టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్భంగా పాలుకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానయుడు పలువురికి నిత్యావసరాలను పంపిణీ చేశారు. ధర్మారావు ఫౌండేషన్ ద్వారా పాలకొల్లులో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, కోర్టు గుమస్తాలు, పేదలకు బియ్యం, నిత్యవసర వస్తువులు, కాయగూరలు, దుస్తులు, మాస్కులను ఎమ్మెల్యే ఉచితంగా పంపిణీ చేశారు.

Related posts